
* తెలంగాణ జర్నలిస్టులకు 15 వేల పెన్షన్ ఇవ్వాలి
* టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
ఆకేరున్యూస్,సూర్యాపేట : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( CM NITHEESH KUMAR )ఆ రాష్ట్రంలో జర్నలిస్టులకు నెలకు రూ.15,000 పెన్షన్ ప్రకటించడం హర్షినియమని ఇది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదర్శనీయమని తెలంగాణ ప్రభుత్వం వెనువెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ (టీఎస్ జేఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ( KANDUKURI YADAGIRI) కోరారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో యాదగిరి మాట్లాడారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగిందని అన్నారు. బీహార్ ( BIHAR)రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ కు సాధ్యమైన ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు సాధ్యపడట్లేదని? ప్రశ్నించారు.ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తాము ఒత్తిడి తేవడానికి కార్యచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. యూనియన్లకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టు తమ అసోసియేషన్ ద్వారా నిర్వహించబోయే ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. లేదా ఏ అసోసియేషన్ ఏ యూనియన్ వారు ఈ డిమాండ్లతో కూడిన ఉద్యమాన్ని చేపట్టిన తాము తప్పనిసరిగా పాల్గొంటామని వివరించారు.జర్నలిస్టుల పట్ల ఔదార్యంతో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్రంలో జర్నలిస్టులందరూ వారి కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని అన్నారు. అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 90% జర్నలిస్టుల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉన్న సంగతి ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు.10% జర్నలిస్టులు మాత్రమే వారు కొనసాగుతున్న మీడియాను అడ్డం పెట్టుకొని శ్రీమంతులుగా మారారని అలాంటివారు జర్నలిస్టుల ( JOURNALIST)సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న ఉద్యమాలను అణచివేస్తున్న సంగతిని దుర్భర స్థితిలో కొనసాగుతున్న ప్రతి జర్నలిస్టు గుర్తించాలని చైతన్యవంతులై ప్రభుత్వాల ద్వారా మన హక్కులను సాధించుకునేందుకు తమతో పాటు ఉద్యమంలో పాలిభాగస్తులు కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు దుస్సా చంద్రశేఖర్, సూర్యాపేట నియోజకవర్గం కోశాధికారి చందుపట్ల శ్రీకాంత్,పట్టణ ఉపాధ్యక్షులు బచ్చలకూరి వెంకన్న,చివ్వెంల,మండల అధ్యక్షుడు కుంచం రాంబాబు సూర్యాపేట పట్టణ సహాయ కార్యదర్శి భట్టారం వంశీకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు
…………………………….