* బండి సంజయ్
ఆకేరున్యూస్, కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ( BANDI SANJAY KUMAR) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందన్నారు. మహారాష్ట్ర (MAHARASTA) లో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ (CONGRESS) కూటమిని నమ్మలేదని.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కరీంనగల్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయమన్నారు. తెలంగాణ (TELANGANA) లోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలు కాబోతున్నాయని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూలుస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని అమలు చేయలేదని.. మహారాష్ట్రలో పట్టిన గతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు.
………………………………………….