BJYM Jangaon
BJYM Jangaon| ఆకేరు న్యూస్, రాయపర్తి: భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జనగామ జిల్లా కమిటీలో రాయపర్తి మండలానికి చెందిన ఇద్దరు యువ నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల గణేష్, జిల్లా ఉపాధ్యక్షుడిగా మంచాల సుమన్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు BJYM జిల్లా నాయకత్వం అధికారికంగా నియామకాలను ప్రకటించింది.
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా..
రాయపర్తి మండల కేంద్రానికి చెందిన పెండ్యాల గణేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ యువతను సమన్వయం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువత సమస్యలపై పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అదేవిధంగా మంచాల సుమన్ యాదవ్ కూడా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ యువతను భాగస్వామ్యం చేయడంలో పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు చేస్తున్న కృషిని గుర్తించి జిల్లా ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు నాయకత్వం పేర్కొంది.
యువతపై ఫోకస్..
తనకు అప్పగించిన బాధ్యతలపై పెండ్యాల గణేష్ మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జనగామ జిల్లాలో BJYM బలోపేతానికి కృషి చేస్తానన్నారు. యువత సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని తెలిపారు.
మంచాల సుమన్ యాదవ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యువతను ఒకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, యువత హక్కుల కోసం నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు.
ఇద్దరి నియామకాలపై రాయపర్తి మండలంలోని బీజేపీ, BJYM నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. గణేష్, సుమన్ యాదవ్‌లకు పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
