
* ఫైనాన్స్ వాహనాలే టార్గెట్
* 15 మంది అరెస్ట్
ఆకేరు న్యూస్, వరంగల్ : కాదేదీ నకిలీ కి అనర్హం అన్నట్లు .. వాహనాలకు దొంగ రిజిస్ట్రేషన్ లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను పోలీసు లు పట్టుకున్నారు. బోగస్ వాహన రిజిస్ట్రేషన్ లతో పాటు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారీ చేసున్న రెండు ముఠాలకు చెందిన 15 మందిని కేటుగాళ్ళను టాస్క్ ఫోర్స్, హన్మకొండ, మిల్స్ కాలనీ, కేయూసి పోలీసులు ఆర్.టి.ఏ అధికారులతో కలిసి అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో వున్నారు. పట్టుబడిన నిందితుల నుండి పోలీసులు 6 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 2 ల్యాప్ టాప్‌లు, 2 థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్ల తో పాటు కంప్యూటర్ చిఫ్ తో కూడిన పివిసి కార్డులు, కార్డు ప్రింటింగ్ కు అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారు వీరే ..
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. యం.డి ఆసిఫ్ ఖురేషి , హన్మకొండ, 2. వడ్లకొండ శ్రీనివాస్ హన్మకొండ, 3. యం.డి నవాబ్ లేబర్ కాలనీ, వరంగల్, 4. యం.డి సాబీర్ ఎల్.బి నగర్, 5. మణికంటి ప్రభాకర్ రెడ్డి, నయీంనగర్, హన్మకొండ, 6. గుగ్గిళ్ళ చెర్రిబాబు కాపువాడ, హన్మకొండ, 7. కెషోజు రాజ్‌కుమార్ అలియాస్ డి.ఎల్ రాజు గుడిబండల్, హన్మకొండ, 8. యం.డి ఆసిఫ్ కరుణావురం, ధర్మసాగర్, 9. అంకం శ్రీనివాస్ ధర్మసాగర్, 10. గొనెల రమేష్ అలియాస్ వాగ్దేవి రమేష్ సుధానగర్, హన్మకొండ, 11. ఎన్. శశివర్ధన్ ఫోర్టు వరంగల్, వరంగల్, 12. నరిశెట్టి రాజేష్ కరీమాబాద్, వరంగల్, 13.తండ దిలివ్ కుమార్ , శాయంపేట హవేలి, గీసుగొండ, 14. ముజ్జిగ ఓంప్రకాశ్ , నక్కలపెల్లి, వరంగల్, 15. ముషిపట్ల అక్షయ్ కుమార్ ఫాతీమానగర్, కాజీపేటకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పరారీలో వున్న నిందితులు లక్ష్మమ్మ, సతీష్, వేల్పుల ప్రశాంత్, దేవులపల్లి శ్రావణ్, మామిడి రాజు @ భూపాలపల్లి రాజు వున్నారు. పట్టుబడిన నిందితుల్లో అధికశాతం ఆర్.టి.ఓ బ్రోకర్లు మరియు వాహన కన్సల్టెన్సీ యజమానులు వున్నారు.
నకిలీ పత్రాల తయారీ ఎలా అంటే..?
ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా వివరాలను వెల్లడించారు. ఈ రెండు కేసులకు సంబంధించి హన్మకొండ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు ఎమ్.డి. ఆసిఫ్ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్ లు ఆర్.టి.ఏ ఏజెంట్లుగా చలామణి అవుతున్నారు. ఫైనాన్స్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన వాటి వాయిదాలు తిరిగి చెల్లించని పక్షంలో ఫైనాన్స్ సంస్థలు స్వాదీనం చేసుకున్న వాహనాలను సదరు వాహన ఫైనాన్స్ సంస్థలు తిరిగి విక్రయించే సమయంలో తప్పనిసరిగా ప్రేష్ రిజిస్ట్రేషన్ కార్డు కొసం ఆర్.టి.ఓ కార్యాలయానికి ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. కాని వాహన ఫైనాన్స్ సంస్థలు అలా చేయకుండా స్వాధీనం చేసుకున్న వాహనాలను నేరుగా స్థానికంగా వున్న వాహన కన్సల్టెన్సీ వ్యాపారస్తులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లతో పాటు ఓరిజినల్ వాహన రిజిస్ట్రేన్ కార్డు లేకుండా వాహనాన్ని విక్రయించేవారు. దీనితో వాహన కన్సల్టెన్సీ వ్యాపారస్తులు వాహనాలను విక్రయించేందుకుగాను అవసరమైన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాల కొసం ప్రధాన నిందితులను సంప్రదించేవారు. దీనితో నిందితులు కన్సల్టెన్సీ ద్వారా విక్రయించే వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్ లైన్ ద్వారా సేకరిస్తారు. ఆన్ లైన్ లో కొనుగొలు చేసిన పీ.వి.సి. కార్డ్ లపై ఆర్.టి.ఓ కార్యాలయముల నుంచి అక్రమంగా వివిధ మార్గాల్లో సేకరించిన ఒరిజినల్ కార్డులపై థర్మల్ ప్రింటింగ్ మిషన్ ద్వారా ఒరిజినల్ తరహలో రిజిస్ట్రేషన్ కార్డులను తయారు చేసి కన్సల్టెస్టీ వ్యాపారస్తులకు అందించడంతో కన్సల్టెన్సీ వ్యాపారస్తులు వాహన ఫైనాన్స్ సంస్థల నుండి కొనుగొలు వాహనాలను ప్రజలకు విక్రయిస్తూ బోగస్ రిజిస్ట్రేషన్ పత్రాలను ఉపయోగించి ఆన్లైన్ లో ఫ్రెష్ రిజిస్ట్రేషన్ లను ఆర్.టి.ఏ నుంచి జారీ చేయిస్తున్నారు.
మరో సంఘటనలో కె.యూ.సి మరియు మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు అరెస్టు చేసిన నిందితులందురు ఆర్.టి.ఏ బ్రోకర్లుగా పనిచేస్తూ ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ అవసరం ఉన్న వాహనాలకు మరియు ఓనర్ షిప్ ట్రాన్స్ఫర్ సమయంలో ఆర్.టి.ఏ నిబంధనల ప్రకారం వాహన బీమా పత్రాలు తప్పనిసరి కాబట్టి దానిని ఆసరాగా చేసుకొని, అవసరమైన భీమా పత్రాల కొసం ఈ ముఠా సభ్యులు ముందుగా ఒక ఒరిజినల్ బీమా పాలసీని తీసుకొని, వారికి వున్న పరిజ్ఞానంతో పాలసీపై ఉన్న వివరాలను మార్చి వాటి స్థానంలో వారికి కావల్సిన వాహన వివరాలు, కావాల్సిన పాలసీ గడువు తేదీలతో కూడిన బోగస్ వాహన పాలసీలను రూపోందించేవారు. ఈ విధంగా రూపొందించిన బీమా పత్రాలను ఆర్.టి.ఓ కార్యాలయానికి ఆన్ లైన్లో దరఖాస్తు చేసి ఫిటెనెస్ రెన్యూవల్ సర్టిఫికెట్ పొందే విదంగా నిందితులు వాహనదారులకు సహకరిస్తూ వారి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూళ్ళుకు పాల్పడేవారని డీసీపీ సలీమా వివరించారు.
రెండు వేర్వురు సంఘటనల్లో హన్మకొండ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా, మిల్స్ కాలనీ పోలీసులు ఆరుగురిని, కేయూసి పోలీసులు మరో ముగ్గురుని అరెస్టు చేసారు. ఈ రెండు సంఘటనల్లో నిందితులు బోగస్ రిజిస్ట్రేషన్ కార్డ్స్, బోగస్ భీమా పత్రాలను అందజేయడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగింది. అలాగే ఆర్.టి.ఓ విభాగానికి సంబంధించి ఎవరైన ఉద్యోగులు నిందితులకు సహకరించానే కోణంపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లుగా సెంట్రల్ జోన్ డిసిపి వెల్లడించారు.
శహబాస్ పోలీస్..
నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచన వరంగల్ ఏసిపి శుభంప్రకాశ్, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, టాస్క్‌ఫోర్స్ ఏసిపి మధుసూధన్, ఇన్స్‌స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్, బాబులాల్, పవన్ కుమార్ మరియు కెయూసి, మిల్స్ కాలనీ, హన్మకొండ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్, రమేష్, శివకుమార్ తో పాటు, టాస్క్ఫొర్స్, కెయూసి, మిల్స్ కాలనీ, హన్మకొండ పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్.ఐలు, ఇతర పోలీస్ సిబ్బందిని సెంట్రల్ జోన్ డిసిపి అభినందించారు.
…………………………………………………….