Maharashtra BJP MLA Parag Shah
* భిక్షాటన చేస్తూ కనిపించిన అత్యంత సంపన్న బీజేపీ ఎమ్మెల్యే ‘పరాగ్ షా’
* సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఆకేరు న్యూస్, డెస్క్ : సాధారణంగా కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు, లగ్జరీ కార్లు, బంగ్లాలు ఉన్న ప్రజాప్రతినిధులు సమాజంలో హోదాగా జీవిస్తారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఒక బిలియనీర్ ఎమ్మెల్యే ముంబయి వీధుల్లో భిక్షమెత్తుకుంటూ కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే! ప్రస్తుతం భాజపా ఎమ్మెల్యే పరగ్ షాకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
* రూ. 3,300 కోట్ల ఆస్తికి యజమాని..
మహారాష్ట్ర శాసనసభలో అత్యంత సంపన్నులైన ఎమ్మెల్యేలలో పరగ్ షా ఒకరు. ఆయన నికర ఆస్తి విలువ దాదాపు రూ. 3,300 కోట్లకు పైనే ఉంటుందని ఎన్నికల అఫిడవిట్ నివేదికల ద్వారా తెలుస్తోంది. అటువంటి కుబేరుడు చిరిగిన దుస్తులు, చేతిలో కర్ర పట్టుకుని ఒక సాధువు లేదా భిక్షగాడి రూపంలో వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు, పార్టీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
*సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ..
ఆయన ఈ రూపంలో తిరగడానికి దారితీసిన పరిస్థితులపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో భాగంగా ఇలా చేస్తున్నారా, లేదా ఏదైనా సామాజిక ప్రయోగం (Social Experiment) నిర్వహించారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
