– కఠిన చర్యలకు సిద్ధమవుతున్న కేంద్రం
ఆకేరు న్యూస్ డెస్క్ : విమానాలకు వరుస బాంబు బెదిరింపులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 19 విమానాలకు ఈ తరహా కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి కట్టడిపై కేంద్ర విమానాయాన శాఖ దృష్టి సారిస్తోంది. ప్రత్యేక నిఘా వ్యవస్థను పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అటువంటి కాల్స్ చేసే వారిని జీవితంలో విమాన ప్రయాణం చేయకుండా నిషేధించడం, నష్టపరిహారం రాబట్టడం, చట్టపరంగా కఠిన శిక్షలు విధించేలా యంత్రాంగం దృష్టి సారిస్తోంది.
బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకోనుంది. విమానాలకు బెదిరింపు కాల్స్‌ను తమ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు చాలా తీవ్రంగా పరిగణిస్తాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ కూడా ప్రకటకించారు. ఇదిలాఉండగా, సోమవారం మూడు విమానాలకు బాంబు బెదిరింపులు జారీ చేసిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.
…………………………………………………………