ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏకకాలంలో పలుచోట్ల ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి(Rangareddy), మెదక్(Medak), సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 30 చోట్ల అధికారులు దాడులు చేశారు. కొల్లూరు, రాయదుర్గం, ఐటీ కారిడార్‌లోని విజయవాడ(Vijayawada)కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. దిల్సుఖ్నగర్ చైతన్యపురిలోని గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ కార్యాలయంతోపాటు, మలక్‌పేటకు చెందిన కాంగ్రెస్ నేత షేక్ అక్బర్ ఇండ్లలో, అతని 15 గూగి ప్రాపర్టీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అన్విత బిల్డర్స్(Anvitha Builders) అధినేత బొప్పన అచ్యుతరావుతోపాటు ఆయన కుటుంబ సభ్యులైన బొప్పన శ్రీనివాసరావు, బొప్పన అనూస్ ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచీ కొనసాగుతున్న ఈ దాడులు చర్చనీయాంశంగా మారాయి.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
