* అత్యవసరంగా ల్యాండిరగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: విమానాల్లో బాంబులు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు, ఈ మెయిల్లు, లేఖల ద్వారా బెదిరించడం అనేది ఇప్పుడు పరిపాటిగా మారింది. తాజాగా రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా అలాంటి బాంబు బెదిరింపు అనుభవమే ఎదురైంది. జైపూర్ నుంచి ముంబైకి బయలుదేరిన ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని ఆ లేఖలో రాసి ఉంది. అప్పటికే విమానం ముంబైకి సమీపించడంతో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయగానే విమానంలోని 225 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
