
* రాజ్ భవన్,సిటీసివిల్ కోర్ట్, జింఖానా క్లబ్,జడ్జి క్వాటర్స్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్
* అప్రమత్తమైన పోలీసులు
* తనిఖీలు చేపట్టిన బాంబ్ స్వ్కాడ్,డాగ్ స్వ్కాడ్ టీంలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లో మంగళవారం కలకలం రేగింది.. గుర్తు తెలియని వ్యక్తులు బాంబు లు పెట్టినట్లు ఫోన్ కాల్ చేసి హడలెత్తించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల చేసి నగర ప్రజలను పరుగులు తీయించారు. ఉదయం పాతబస్తీలో ఉన్న సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రాగా కోర్టులో రోజువారీ కార్యకలాపాలను నిలిపివేసి బాంబ్ స్వ్కాడ్ కు సమాచారం అందించారు.అలాగే జడ్జి చాంబర్, జింఖానీ క్లబ్,జడ్జి క్వాటర్స్‌లో బాంబలు పెట్టినట్లు అగంతకుల నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. గవర్నర్ నివాసం అయిన రాజ్ భవన్లో బాంబు పెట్టినట్లు మెయిల్ రావడంతో రాజ్ భవన్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. తక్షణమే అప్రమత్తమయిన పోలీసులు రాజభవన్తో పాటు సిటీ సివిల్ కోర్టు,జింఖానా క్లబ్, జడ్జిక్వాటర్స్లో బాంబ్ స్వ్కాడ్,డాగ్ స్వ్కాడ్లతో కలిసి తనిఖీలు చేపట్టారు.
…………………………………………………………….