* రాజేంద్రనగర్‌లో వివాహిత న్యాయపోరాటం
* భర్త ఇంటి ముందు ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆమె చేసిన పాపం.. ఓ బిడ్డకు జన్మనివ్వడమే. ఆ బిడ్డ లోపాలతో పుట్టినందుకు భర్త ఆమెను దూరం పెట్టాడు. దివ్యాంగుడైన కొడుకును వదిలేస్తేనే ఇంటికి రావాలని కండీషన్ పెట్టాడు. దీంతో ఆమె బిడ్డతో కలిసి భర్త ఇంటి ముందు న్యాయపోరాటం (Fight For justice)చేస్తోంది. రాజేంద్రనగర్(Rajendra Nagar)లో జరిగిన ఈ ఘటన మానవత్వానికి మాయని మచ్చగా మిగిలింది. అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడకు చెందిన బీటుకూరి ఉదయ్ భాస్కర్(Uday Bhaskar), అలేఖ్య(Alekya) భార్యభర్తలు. ఆ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. పుట్టుకతోనే శారీరక లోపాలు ఉన్నాయి. దివ్యాంగుడిగా పుట్టాడు. దీంతో బిడ్డను, భార్యను ఉదయ్ భాస్కర్ దూరం పెట్టాడు. కొడుకును వదిలేస్తేనే ఇంటికి రావాలని కర్కశంగా మారాడు. భార్య ఎంత నచ్చజెప్పినా వినలేదు. కన్నకొడుకును ఎలా వదిలేస్తామని ఆమె ఆవేదన చెందుతోంది. ఉదయ్ తీరుకు అలేఖ్య కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఆందోళన చేపడుతున్నారు.
————————-