ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : బ్రెజిల్ ను వరదలు అల్లకల్లోలం చేశాయి. బీభత్సం సృష్టించాయి. ఇప్పటి వరకు 109 మంది వరదలకు చనిపోయినట్లు తెలుస్తోంది. బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ ప్రాంతంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. వర్షాలకు వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి పెట్టి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇంకా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని బ్రెజిల్ వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈనేపథ్యంలో రియో గ్రాండే దో సుల్ గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 400 మంది గాయపడ్డారని, మరో 128 మంది ఆచూకీ తెలియడం లేదని రాష్ట్ర అధికారులు తెలిపారు. వరదలకు సుమారు 10 లక్షల మంది ప్రభావితమయ్యారని చెప్పారు. వరదల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
———————–