* ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 28 వ తేదీన కాకుండా 29న సీఎం వరంగల్ పర్యటన ఉంటుందని అధికారులు తెలియ జేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వరంగల్ కు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మంత్రి వర్గ విస్తరణ, నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం లాంటి అంశాల చర్చించేందుకు ఢిల్లీలోనే శుక్రవారం ఉండాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీంతో రేపటి వరంగల్ పర్యటన వాయిదా పడింది.
—————————————-