KCR Lunch Meeting BRS Leaders
* ఇప్పటికే ఎర్రవెల్లి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌రావు
* కీలక నిర్ణయాలపై చర్చించే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సుదీర్ఘ విరామం అనంతరం బీఆర్ఎస్ అధినేత, , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కీలక నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన ఈ ఆత్మీయ విందు భేటీలో కేసీఆర్ ప్రజాప్రతినిధులతో కలిసి భోజనం చేస్తూ, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు కేసీఆర్ ఉంటున్న ఫామ్ హౌస్‌కు కాసేపటి క్రితం చేరుకున్నారు.
* అసెంబ్లీలో ఏం చేద్దాం?
అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా శాసనసభ, శాసనమండలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టాలనే అంశంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధుల విడుదల, యూరియా కొరత, 22A నిషేధిత భూముల వివాదం మరియు కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీయాలని నేతలకు ఆయన ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిసింది. సభలో ప్రతిపక్షంగా ప్రజల గొంతును సమర్థవంతంగా వినిపించాలని, సభ్యులందరూ సమన్వయంతో వ్యవహరించాలని కేసీఆర్ ఈ లంచ్ మీటింగ్ ద్వారా దిశా నిర్దేశం చేయనున్నారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా జరిగిన ఈ భేటీ, రాబోయే శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ అనుసరించబోయే వ్యూహానికి అత్యంత కీలక వేదికగా మారింది.
* సమన్వయం
భోజనం చేస్తూనే నేతలతో వ్యక్తిగతంగా కేసీఆర్ మాట్లాడనున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ పరిస్థితి, నియోజకవర్గాల పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. అసెంబ్లీ వ్యూహంపై కీలక దిశానిర్దేశంశాసనసభలో ప్రతిపక్షంగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా ఎండగట్టాలని కేసీఆర్ ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సూచించారు.రైతు రుణమాఫీ అమలులో జరుగుతున్న జాప్యం, రైతు భరోసా, సాగునీటి సరఫరా, లగచర్ల లాంటి భూసేకరణ వివాదాలు, శాంతిభద్రతల సమస్యలను సభలో బలంగా లేవనెత్తాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై లొంగకుండా పూర్తి ఆధారాలతో మాట్లాడాలని, సభ జరిగేన్ని రోజులూ సభ్యులందరూ పూర్తి స్థాయిలో హాజరై సమన్వయం పాటించాలని ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
