
* పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
ఆకేరున్యూస్, గజ్వెల్: రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్దే అని పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు . ’గోదావరి కన్నీటి గోస’ పేరుతో గోదావరి నది నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర నిర్వహించి.. శనివారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ పాదయాత్ర బృందంతో కేసీఆర్ సమావేశమై మాట్లాడారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని.. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని హితవుపలికారు. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని.. ఒక్క హావిూ కూడా నెరవేర్చడం లేదన్నారు. ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదని.. బలవంతంగా మనల్ని ఆంధ్రాలో కలిపారనన్నారు.
………………………………………..