
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడని స్పీకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. సభను తప్పు దోవ పట్టిస్తున్నారు అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై తక్షణమే చర్య తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు.
………………………………….