Mulugu BRS Protest
* కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బిఆర్ఎస్ పార్టీ భారీ ధర్నాలు,ర్యాలీలు.
ఆకేరు న్యూస్,ములుగు:
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం అన్నదాతలకు అండగా నిలిచే ‘రైతు భీమా’ పరిహారాన్ని అందజేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం ములుగు జిల్లా వ్యాప్తంగా కేంద్రాలలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు దీంతో పోలీసులు ర్యాలీని మధ్యలోనే అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను నిరసిస్తూ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పోలీసులతో అణచివేత చర్యలు ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అణచివేసే కుట్ర చేస్తోందని, శాంతియుతంగా చేపడుతున్న ర్యాలీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. కేసీఆర్ గారి హయాంలో పేద ఇంటి ఆడపడుచు పెళ్లికి కొండంత అండగా నిలిచిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పక్కన పడేసిందని, నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రైతుల కుటుంబాలకు భరోసానిచ్చే ‘రైతు భీమా’ పథకాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ, మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. షాదీ ముబారక్ చెక్కులను, రైతు భీమా పరిహారాన్ని తక్షణమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ములుగు జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి,ఏటూర్ నాగారం మండలాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
