కాంగ్రెస్ పార్టీ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి
* సీఎం రేవంత్ ను కలిసిన చల్లా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : వచ్చే వారిని వద్దనేది లే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). పార్టీ మారిన వారిన రాళ్లతో కొట్టాలంటూ గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అలాంటి వారికి ఎలా కండువా కప్పుతారని విమర్శలు వ్యక్తం అవుతున్నా రేవంత్ ఇవేవీ పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో ఆయన టార్గెట్ చేశారు. అవసరం ఉన్నా, లేకపోయినా చేరికలను ఆపట్లేదు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు పిలిచి మరీ కాంగ్రెస్ కండువా కప్పేస్తున్నారు. ఈ ఖాతాల్లో తాజాగా మరో బీఆర్ఎస్ లీడర్ చేరారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి (Challa Venkatrami Reddy) కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సమ్మతించినట్లు తెలిసింది. రేవంత్ మహబూబ్నగర్ పర్యటనలో చల్లా కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
