ఎమ్మెల్సీ దండే విఠల్
* హైకోర్టు సంచలన తీర్పు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అతడి ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.ఆయనకు రూ. 50 వేల జరిమాన విధించింది.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గా 2022 లో దండే విఠల్ ఎన్నకయ్యారు. ఈ ఎన్నికల్లో తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని తన సంతకాలు ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును, ఫోర్జరీని తేల్చేందుకు పత్రలను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని కోరారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ చేసి విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ నేడు తీర్పు వెల్లడించింది.
——————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
