
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఏసీ మీటింగ్ నుంచి బీఆర్ ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రేపటి ఎజెండా ఏంటో చెప్పకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోందని విమర్శించారు. ఎజెండా ఏంటో తెలియకుండా ప్రతిపక్షాలు ఎలా ప్రిపేర్ అవుతాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ను బద్నాం చేయడానికే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని హరీష్ అన్నారు. రైతుల సమస్యల గురించి చర్చించకుండా, యూరియా కొరతపై మాట్లాడకుండా, మరి దేనిపై చర్చిస్తారని హరీష్ ప్రశ్నించారు. బీఏసీ సమావేశం అర్థం పర్థం లేనిదని హరీష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. రాజ్యంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ మరి తమ పార్టీ ఎంత మేర రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తుందో చెప్పాలని కోరారు. కనీసం 15 రోజులైనా అసెంబ్లీని నిర్వహిస్తే ప్రజాసమస్యలపై చర్చించే అవకాశం లభిస్తుందని హరీష్ అన్నారు.
………………………………….