- బీఆర్ ఎస్ తో పొత్తుకు నో చెప్పిన మాయావతి
- బీజేపీ కుట్రల వల్లనే ఈ పరిస్థితి అంటున్న ప్రవీణ్ అభిమానులు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ( BSP )కి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ( Dr RS Praveen Kumar) రాజీనామా చేశారు. తన ఎక్స్ X ( ట్విటర్ ) వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల బీఆర్ ఎస్ ( BRS ) అధినేత కేసీఆర్ ( KCR ) ను కలిశారు. పరస్పరం పొత్తుకు సంబందించి చర్చలు జరిపామని తెలిపారు. రెండు పార్లమెంట్ సీట్లను బీఎస్పీకి కెటాయిస్తున్నట్టు బీఆర్ ఎస్ ప్రకటించింది. నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాలను బీఎస్పీకి కెటాయించినట్లు బీఆర్ ఎస్ ప్రకటించింది. నాగర్ కర్నూలు లోక్ సభ స్థానం నుంచి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీ (BJP ) అధిష్టానం బీఎస్పీ అధినేత మాయావతి మీద ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును భగ్నం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నే ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ బీఆర్ ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసే అవకాశాలున్నాయి.
ప్రవీణ్ ట్విటర్ వేదికగా ఇలా ప్రకటించారు..
పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం.
నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.
బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. మళ్లీ చెబుతున్నా …చివరి వరకు బహుజన వాదాన్ని నా గుండెలో పదిలంగా దాచుకుంటా…
– డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్