* ప్రేమించిన యువతి తల్లిదండ్రులను చంపిన ఉన్మాది..
* పోలీసులు ఇన్వాల్వ్ కావొద్దు.. తానే చంపేస్తానంటున్న యువతి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా (Warangal District) లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి తల్లిదండ్రులను ఓ ఉన్మాది దారుణంగా చేశాడు. అడ్డొచ్చిన యువతితోపాటు ఆమె సోదరుడిపై కూడా దాడికి తెగబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట (Chenna raopeta) మండలం చింతల్తండా (Chintalthanda) కు చెందిన బానోతు శివ(Banothu Shiva), సుగుణ (Suguna) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తె దీపిక (Deepika) ను అదే గ్రామానికి చెందిన యువకుడు బన్నీ (Bunny) ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం దీపిక ఇంటికి వచ్చిన బన్నీ తల్వార్ (Talwar) తో ఆమెపై దాడికి ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన తల్లిదండ్రులపైన, ఆమె సోదరుడిపై కూడా బన్నీ దాడి చేశాడు. ఈ ఘటనలో యువతి తల్లిదండ్రులు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. దీపిక, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు బన్నీని అరెస్టు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత యువతి మాట్లాడుతూ.. ఈ విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ కావొద్దని, బన్నీని తాను చంపేస్తానని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
———————–