Palakurthi MLA Mamidala Yashaswini Reddy
* కాంగ్రెస్లోకి 20 కుటుంబాల చేరిక..
ఆకేరు న్యూస్, రాయపర్తి : రాయపర్తి మండలం బురహాన్ పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామ సర్పంచ్ సూదుల ఉమాదేవి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు 20 కుటుంబాలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
* ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో చేరికలు..
పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సాదరంగా ఆహ్వానించి, కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ ఒక్క కార్యకర్తకు, కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, సీనియర్ నాయకులతో సమానంగా గౌరవం ఇస్తామని భరోసా కల్పించారు. అందరం కలిసికట్టుగా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

