Summer Holidays Movie
* ‘సమ్మర్ హాలిడేస్’పై హీరో కిరణ్ అబ్బవరం!
* చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సినిమా..
* ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్, బాబీ, కిరణ్ అబ్బవరం సందడి
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : చిన్ననాటి వేసవి సెలవులు, అమ్మమ్మ ఊరు, స్నేహితులతో ఆటలు.. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసే కథతో తెరకెక్కిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ధీరజ్ మొగిలినేని నిర్మాణంలో శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 6న దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత అల్లు అరవింద్, హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘ఈ ఈవెంట్ చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. సినిమాలో నటించిన పిల్లలు చాలా టాలెంటెడ్‌గా ఉన్నారు. ఈ జనరేషన్ పిల్లలు ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. మనమంతా జీవితంలో చాలా బిజీగా గడిపేస్తున్నాం. ఈ సినిమా మనం మర్చిపోయిన జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. మనల్ని అమ్మమ్మ ఊరికి తీసుకెళ్తుంది. ఇది చిన్న సినిమా, పిల్లల సినిమా అనే భావన ఎక్కడా కలగలేదు. సినిమా చూస్తున్నంతసేపు పెద్దలు కూడా పిల్లలైపోయి ఎంజాయ్ చేస్తారు. ఈ దీపావళికి కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాను చూడండి’ అని కోరారు.

* ఇది పిల్లల సినిమా కాదు.. పెద్దల సినిమా – ధీరజ్ మొగిలినేని
నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. ‘కథ విన్నప్పుడు నాకు బాగా కనెక్ట్ అయింది. నా వయసు వాళ్లందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్మాను. సినిమా చూస్తున్నంతసేపు మీ బాల్యం గుర్తుకొస్తుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక చిన్ననాటి స్నేహితులకు ఫోన్ చేయాలనిపిస్తుంది. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. మన బిజీ జీవితంలో మర్చిపోతున్న మధుర జ్ఞాపకాలను ఈ చిత్రం గుర్తుచేస్తుంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ దీపావళికి ప్రేక్షకులను అలరించబోతున్నాం’ అన్నారు. అలాగే హీరో కిరణ్ అబ్బవరంతో రాయలసీమ నేపథ్యంలో ఓ సినిమా నిర్మించాలని ఉందని తెలిపారు.
* మంచి కంటెంట్‌తో పాటు సందేశం – దర్శకుడు బాబీ
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘ధీరజ్ ఏ సినిమా చేసినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత నా కుటుంబానికి కూడా చూపించాలని అనిపించింది. ప్రస్తుత తరంలో పిల్లలకు చదువు, ఒత్తిడి ఎక్కువయ్యాయి. ఈ సినిమా వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందిస్తుందని భావిస్తున్నాను. పిల్లలతో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు శ్రీకర్ మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారు. పిల్లలు ఎంత స్వచ్ఛంగా ఉంటారో ఈ సినిమా కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది’ అన్నారు.

* నాస్టాల్జిక్ ఫీల్ ఇచ్చే సినిమా – అల్లు అరవింద్
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ధీరజ్ నాతో కలిసి సినిమాలు చేశారు. ఈ సినిమా బాగా వచ్చిందని విన్నాను. సరిగ్గా రాని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలనే పద్ధతిని ధీరజ్ కూడా పాటించారు. దర్శకుడు శ్రీకర్ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారని తెలిసింది. ఇలాంటి మంచి చిత్రానికి మద్దతుగా కిరణ్ అబ్బవరం రావడం అభినందనీయం. పలువురు దర్శకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి తమ ఆశీస్సులు అందించారు. ఈ సినిమా మంచి నాస్టాల్జిక్ ఫిల్మ్‌గా నిలుస్తుందని భావిస్తున్నాను’ అన్నారు.
* అమ్మమ్మ పాత్రలో జయసుధ..
సహజనటి జయసుధ మాట్లాడుతూ.. ‘ఈ పిల్లలు మాట్లాడుతున్న మాటలు వింటుంటే మళ్లీ స్కూల్‌కు వెళ్లాలనిపిస్తోంది. ఈ సినిమాలో అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో నటించాను. ఇది కేవలం పిల్లల సినిమా కాదు. తల్లిదండ్రులు, అమ్మమ్మ, వేసవి సెలవుల చుట్టూ అల్లుకున్న కథ. అందరూ కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడాలి. ధీరజ్ ఇలాంటి మంచి చిత్రాలను మరిన్ని నిర్మించాలి. కొత్త దర్శకులను, కొత్త ప్రతిభను ప్రోత్సహించాలి’ అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు తన బాల్యం గుర్తుకొచ్చిందని తెలిపారు. దర్శకుడు శ్రీకర్ ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఇందులో ఉంటుందని చెప్పారు.
దర్శకుడు శ్రీకర్ నయన్ మాట్లాడుతూ.. పిల్లల తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ సినిమాను పూర్తి చేయగలిగానని తెలిపారు. జయసుధ అమ్మమ్మ సుశీలమ్మ పాత్రలో ప్రేక్షకులకు బాగా నచ్చుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమాకు ఇద్దరు హీరోలని పేర్కొన్నారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుందని అన్నారు.
మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ.. ‘సమ్మర్ హాలిడేస్’ తన మనసులో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పారు. ఈ సినిమా ద్వారా 90వ దశకంలోకి వెళ్లిన అనుభూతి కలిగిందని, జయసుధతో కలిసి నటించడం తన అదృష్టమని తెలిపారు. సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ రోహన్ రాయ్, బేబీ ఖుషి, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్, మాస్టర్ ప్రజ్వల్, ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి ప్రియం, రచయిత కొండల్ రావు, సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి తదితరులు పాల్గొన్నారు. దర్శకులు నందకిషోర్, రామ్ జగదీశ్, కౌశిక్, రాహుల్ రవీంద్రన్ సహా పలువురు సినీ ప్రముఖులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
రోహన్ రాయ్, అరుణ్, ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించగా, సింజిత్ యెర్రమల్లి సంగీతం అందించారు. నవంబర్ 6న ‘సమ్మర్ హాలిడేస్’ థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

