RC17 Movie Update
ఆకేరు న్యూస్, హైదరాబాద్: స్టార్ డైరెక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆర్ సీ 17. వీరిద్దరి కాంబినేషన్ ఇది రెండో సినిమా. రంగస్థలం మూవీ కోసం ఇద్దరు కలిసి పనిచేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ అంటే బాగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక పుష్ప 2 పాన్ ఇండియా లెవల్ లో హిట్ కావడంతో సుకుమార్ పేరు మారుమోగింది.
* హీరోయిన్ గా కాంతర ఫ్రేం నటి ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో కాంతర 2 ఫ్రేం కన్నడ నటి రుక్మిణి వసంత్ ప్రాజెక్టులో భాగమవుతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు మేకర్స్ ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
* లేడీసూపర్ స్టార్ కు కీలక పాత్ర ..
లేడీసూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవితో ఇప్పటికే సైరా నరసింహారెడ్డి , గాడ్ ఫాదర్, మన శివశంకరవరప్రసాద్ గారు వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ఆయన వారసుడు చరణ్ నటిస్తున్న ఆర్ సీ 17 లో కీలక మైన ఒక పాత్రలో కనిపించి అలరించనున్నట్లు తెలిసింది. దీనిపై కూడా చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు.
* మ్యూజిక్ ఛేంచ్..
సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్(డీఎస్పీ) జోడి అంటే మ్యూజికల్ హిట్ కు కేరాఫ్ అడ్రసు అన్నవిషయం తెలిసిందే.. ఆర్య నుంచి మొదలుకొని నిన్నమొన్నటి పుష్ప 2 వరకు ఇద్దరు కలిసి చేశారు. కాని ఈసారి సుక్కు కాస్త డీఎస్పీకి బదులుగా ధురంధర్ మూవీకి సంగీతం అందించిన దర్శకుడు శాశ్వత్ సబ్ దేవ్ పై మొగ్గు చూపుతున్నారని టాక్ వినిపిస్తున్నది. ఈ విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వేచి చూడాలి మరీ డీఎస్పీనా? సబ్ దేవా?.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
