
* ప్రతిపక్ష నేతగా ఉన్నా చాన్స్ ఇవ్వట్లే
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
* నేడు మొదలైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. మొదటిరోజే అధికార పక్షంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (RahulGandhi) అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం అనంతరం ‘ఆపరేషన్ సిందూర్’తో పాటు అనేక కీలక అంశాలపై చర్చ జరగాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను విరమించాలని సభాపతి పలు మార్లు విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకో లేదు. దీంతో లోక్‌సభను కొంతసేపు వాయిదా వేశారు. అయితే అదే సమయంలో రాజ్యసభ (Rajyasabha)లో చర్చలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. రక్షణ మంత్రి, ప్రభుత్వంలోని ఇతర మంత్రులకు మాట్లాడటానికి అనుమతి ఇచ్చారని.. తనకు మాత్రం పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం (Nda Government) ప్రతి విషయంలో తమకు అనుకూలంగా ఉండే విధంగా కొత్త విధానాలను తీసుకొస్తోందని ఆయన విమర్శించారు.
……………………………………