* దంపతుల దుర్మరణం.. నలుగురికి గాయాలు
* మరో వేర్వేరు ప్రమాదాల్లో బాలుడు, బాలిక మృతి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు(ROAD ACCIDENTS) తీవ్ర విషాదాన్ని నింపాయి. హైదరాబాద్ లంగర్‌హౌస్(LUNGERHOUSE)లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌కై వెళుతున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా, మోద్కురుకు చెందిన ప్రణయ్‌గా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్‌కు చెందిన నవ దంపతులు.. దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లు మృతి చెందారు. రెండు రోజుల క్రితం దినేష్ పుట్టినరోజు ఉండడంతో వారు లంగర్ హౌస్‌కు వెళ్ళారు. మొనా ఠాకూరు గర్భిణి కావడం గమనార్హం. కాగా, చర్లప్లలి(CHARLAPALLI) డివిజన్ లో జరిగిన మరో ప్రమాదంలో కారు ఢీకొని చిన్నారి ఆధ్య (9) మృతి చెందింది. ఘట్కేసర్ మండలం, మేడిపల్లికి చెందిన బంటు రమేష్ కుమార్తె. ఖమ్మం జిల్లా(KHAMMAM DISTRICT)లో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. రాజు తనకుటుంబంతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రాజు ఐదేళ్ల కుమారుడు యశ్వంత్ (5) మృతి చెందాడు.
……………………………………………….