* అక్రమాస్తుల కేసులో 14 రోజులు రిమాండ్
* చంచల్గూడ జైలుకు తరలింపు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నీరు పారుదల శాఖ ఏఈఈగా పని చేస్తున్న నిఖేశ్కుమార్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించింది. దీంతో శనివారం ఉదయం గండిపేట మండలం పీరంచెరువు పెబెల్సిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి అక్రమాస్తుల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిఖేశ్కుమార్ను ఏసీబీ అరెస్టు చేసి జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో అధికారులు ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
