
సినిమా హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదు
* ఆధారాలు సమర్పించిన లావణ్య
* అబార్షన్ చేయించినట్లు మెడికల్ రిపోర్టులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సినీ హీరో రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి. రాజ్ తరుణ్ (Raj Tarun)తనను మోసం చేశాడంటూ ఆరోపిస్తున్న లావణ్య (Lavanya) ఈమేరకు టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులకు అందజేశారు. తనకు అబార్షన్ కూడా చేయించాడని మెడికల్ రిపోర్టులు ఇచ్చినట్లు తెలిసింది. నార్సింగి పోలీసులకు 170 ఫొటోలు అందజేసింది. ఈ మేరకు పోలీసులు రాజ్ తరుణ్‌పై ఐపీసీ 493 సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
లావణ్యపై నటి మల్హోత్రా ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. లావణ్యపై నటి మాల్వి మల్హోత్రా (Malvi Malhotra) ఫిలింనగర్ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై లావణ్య తప్పుడు ప్రచారం చేస్తుందని, ఆమె చేసినవన్నీ అబద్దపు ఆరోపణలు అని, తనే నా సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
——————————————————-