– 22 మందికి తీవ్రమైన అస్వస్థత
ఆకేరు న్యూస్, అనకాపల్లి : అనకాపల్లి జిల్లా (Anakapalli District) నక్కపల్లి (Nakkapally) ప్రభుత్వాస్పత్రి (Government Hospital) లో ఇంజక్షన్ వికటించి 22 మంది అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన వారికి మంగళవారం సెఫోటాక్సిన్ ఇంజక్షన్ ఇవ్వడంతో తీవ్రమైన వణుకు, వాంతులకు గురైనట్లు బాధితులు తెలిపారు. దీంతో వారందరినీ అంబులెన్సుల్లో నక్కపల్లి ప్రభుత్వాస్పత్రి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ (NTR Hospital) కు తరలించారు. అయితే బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో బుధవారం అతడిని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అబర్వేషన్లో ఉంచుతామని వెల్లడించారు.
———————