
* యువకుడికి గాయాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ప్యాంట్ జేబులో పెట్టుకున్న సెల్ ఫోన్ పేలి యువకుడికి గాయాలైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ పెయింటర్ గా పనిచేస్తున్నారు. శుక్రవారం అలవాటు ప్రకారం సెల్ ఫోన్ ను జేబులో వేసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా ఆ ఫోన్ హాఠాత్తుగా పేలిపోయింది. దీంతో శ్రినివాస్ తొడకు తీవ్ర గాయాలయ్యాయి, గాయాలతో భాధపడుతున్న శ్రీనివాస్ ను స్థానికులు సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.
…………………………………………………….