* అంబాలలో నిన్న రాత్రి జరిగిన ఘటన
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలోని బంగారం చైన్ తెంపుకుని పరారయ్యారు. మండలంలో అంబాల గ్రామ శివారులోని సాకేత స్కూల్ వద్ద నిన్న శుక్రవారం రాత్రి కిరాణా దుకాణంలో ఈ ఘటన జరిగింది. బైకుపై దుకాణానికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల్లో ఒకరు ఆలుగడ్డలు ఉన్నాయా, తమ్స్ అప్ ఉందా అని మాటల్లో పెట్టి షాప్ నిర్వాహకురాలు మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసుని లాక్కుని బైక్ పై ఉన్న మరొక వ్యక్తి తో పరారయ్యారు. సమాచారం అందుకున్న సిఐ హరికృష్ణ , ఎస్సై వీరభద్ర రావు, పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి బాధితురాలు కెత్తే శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మండలంలో వరుస దొంగతనాలు
కాగా గత నాలుగు రోజుల క్రితం అంబాల గ్రామ శివారులోని ఓ గొర్రెల కాపరి మందలోని మూడు పొట్టేలు, మూడు మేకపోతులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఇదే నెలలో మండలంలోని శనిగరం గ్రామ శివారులో గల మడేలయ్య గుడిలో విగ్రహాలను ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహం పైనున్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న చోరీలతో స్థానిక మహిళలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలను గుర్తించి పోలీసులు వారి ఆట కట్టించాలని కోరుతున్నారు.
………………………………..