* అమెరికా, కెనడా దేశం నుంచి నిపుణులు
* నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు పర్యటన
ఆకేరు న్యూస్, విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి (Chief Minister of AP) గా బాధ్యతలు తీసుకున్న వెంటనే పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పై దృష్టి సారించిన చంద్రబాబునాయుడు (Chandrababu Naidu).. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram project) పూర్తికి ఎన్నో సవాళ్లను అధిగమించాలని, అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం అవసరమని కేంద్ర జలసంఘం (Central Water Society) నిర్ణయించిన క్రమంలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా డిజైన్ల (Designs) ను రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ (International Design Agency) అఫ్రి (Afri) సాయం తీసుకుంటున్నారు.
వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్ (David B. Paul from America), గియాస్ ఫ్రాంకో డి సిస్కో (Gias Franco de Cisco), సీస్ హించ్‌బెర్గర్ (Sees Hinchberger), కెనడాకు చెందిన రిచర్డ్ డోన్నెల్లీ ప్రాజెక్టు (Richard Donnelly Project) సందర్శనకు రాష్ట్రానికి వచ్చారు. ఆ అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం (International Group of Water Resources Experts) ప్రాజెక్టును ఆదివారం పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను పరిశీలించారు. తొలుత ఈరోజు ఎగువ కాఫర్ డ్యాంను సందర్శించారు. ప్రాజెక్టు కట్టడాలు, నిర్మాణాలు పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన డిజైన్లు, నిర్మాణ షెడ్యూల్, అధ్యయనాల నివేదికలు, నిర్మాణ క్రమం సందర్భంగా తీసిన ఫోటోలు వారికి అందించేందుకు పోలవరం అధికారులు తగు ఏర్పాట్లను చేశారు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ క్రమంపై ఫొటోలతో స్థానిక అధికారులు రిపోర్టును అందించారు.
రెండో రోజు పర్యటన ఇలా..
మొత్తం నాలుగు రోజుల పాటు నిపుణుల బృందం (A team of experts) ప్రాజెక్టు (Project) ను పరిశీలించనుంది. రెండో రోజు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాలు, డయాఫ్రం వాల్ విధ్వంసం పరిశీలన, అగాధాలు, అక్కడ భూభౌతిక పరిస్థితుల మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణుల బృందంపై ఫోకస్ చేయనుంది. తొలి రోజు రెండు గంటల పాటు అక్కడే ఉండటంతో పాటు రెండో రోజు మొత్తం ఇందుకే కేటాయిస్తారు. ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాళ్లన్నీ ఇక్కడే ఉండటంతో, రెండు గంటల పాటు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని నిపుణులు పరిశీలించనున్నారు.
————————–