* 18 మంది దుర్మరణం
* 40 మందికిపైగా గాయాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : నైజీరియా (Nigeria) లోని నార్త్ ఈస్ట్ బోర్న్రాష్ట్రం (North East Bourne State) లో ఆత్మాహుతి దాడులు (Suicide attacks) కలకలం రేపాయి. వరుసగా మూడు చోట్ల అనుమానిత మహిళా బాంబర్లు (Women Bombers) ఈ దాడులకు పాల్పడ్డారు. పెళ్లి (Wedding), అంత్యక్రియలు (Funeral), ఆస్పత్రులే (Hospitals) లక్ష్యంగా చేసుకుని పాల్పడిన ఈ దాడుల్లో 18 మంది దుర్మరణం (18 people died) చెందారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు (More than 40 people were injured). ఈశాన్య నైజీరియా (Northeast Nigeria) లోని గ్వోజా పట్టణం (Gwoza town) లోని ఓ ఆస్పత్రిపై ఆత్మాహుతి దాడి (Suicide attack) జరిగింది. అదేవిధంగా ఓ పెళ్లిలో ఇద్దరు మహిళలు బాంబులు కట్టుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
పెళ్లిలో మరణించిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఇలా మొత్తం మూడు ఆత్మాహుతి దాడుల్లో కలిపి 18 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం వివిధ ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో మహిళలు (Women), చిన్నారులు (children), గర్భిణీలు (Pregnant women) ఉన్నారు. వరుస పేలుళ్లు కలకలం రేపాయి. ఘటనాస్థలిలో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. భీతావహ దృశ్యాలు కనిపించాయి. 2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలోని గ్వోజా (Gwoza) ను బోకోహరం తీవ్రవాదులు (Boko Haram terrorists) స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా భద్రతా బలగాలు 2015లో గ్వోజాను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి బోకోహరం తీవ్రవాదులు గ్వోజాపై దాడుల (Attacks) కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఈ దాడుల్లో 40 వేల మంది చనిపోగా, 20 లక్షల మంది దాకా నిరాశ్రయులయ్యారు.
——————————-