మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : అధికారిక లాంఛనాలతో కాంగ్రెస్ సీనియర్ నేత (Congress senior leader), మాజీ పీసీసీ చీఫ్ (Former PCC chief) ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) అంత్యక్రియలు (Funeral) ఆదివారం ముగిశాయి. నివాసం నుంచి కంటేశ్వర్ మీదుగా సాగిన అంతిమయాత్ర నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని స్మశాన వాటికకు చేరుకుంది. అక్కడే అంత్యక్రియలు పూర్తయ్యాయి. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. డీఎస్ చిన్న కుమారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు డీఎస్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. డీఎస్ ను చివరిచూపు చూసుకునేందుకు అభిమానులు, కార్యకర్తలు, బంధువుల భారీగా తరలివచ్చారు. ఉదయం డీఎస్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి (Deputy CM Bhatti), మంత్రులు (Ministers), కాంగ్రెస్ నేతలు (Congress leaders), కార్యకర్తలు ఆయన పార్థివ దేహాన్న సందర్శించారు. డీఎస్ పార్థివదేహాంపై కాంగ్రెస్ జెండా(Congress flag) కప్పారు.
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
