* ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : విశాఖ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు సీఐఐ సదస్సు జరుగుతున్న విషయం తెల్సిందే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సీఐఐ సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విశాఖలో ఉండి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో దాదాపు 50 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. అయితే సమ్మిట్ కు మందే పలు కంపెనీలతో ఒప్పందాలు ఖరారైనట్లు ఏపీ సీఎం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర పారిశ్రామికవృద్ధి మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 400 కోట్ల రూపాయిలతో కుప్పంలో 470 ఎకరాల్లో పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని.. దీని వలన 50 వేల ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.మిజోలి ఇండియా జెవి, మిజోలి యూఎస్ఏ, క్రియేటివ్ సెన్సోర్ (తైవాన్), సినేస్టి టెక్నాలజీలు 23 జిడబ్ల్యూహెచ్ ఫ్రికర్సర్ ఫ్రి సింగిల్ క్రిస్టర్ క్యాతోడ్ యాక్టివ్ మెటీరియల్, సాలిడ్ స్టేట్ ఎలక్ట్రోలైట్ మ్యానిఫ్యాక్చరింగ్ ఫేసిలిటిని ఓర్వకల్లు, కర్నూలులో రూ.18 వేల కోట్లతో ఏర్పాటు చేయనుంది. వీటివల్ల 2 వేల ప్రత్యక్ష ఉద్యోగాలు రానున్నాయన్నారు.
