Former Maoist leader Chandranna
* జల్ – జంగల్ – జమీన్ కోసం కొమురం భీం పోరాటం
* కొమురం భీం ఆశయాలు ఇప్పటికీ అమలు కాలేదు
మాజీ మావోయిస్ట్ నేత చంద్రన్న సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ప్రజల్లోనే ఉంటాం.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు నిర్మిస్తామని మావోయిస్ట్ పార్టీ మాజీ నేత పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కొమరం భీం జిల్లా జోడేఘట్ యుద్ధభూమిలో కొమరం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా కొమరం భీమ్ కు ఘననివాళి అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొమురం భీం ఏ సమస్యల పరిష్కారం కోసం అమరుడు అయ్యాడో ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. జల్ జంగల్, జమీన్ పై ఆదివాసీలకు పూర్తి స్థాయి హక్కులు రాలేదన్నారు. ఆదివాసీ ప్రజలతో పాటు ఆదివాసేతర ప్రజలు కలిసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు..
* ప్రజల్లోనే ఉంటాం- ప్రజా పోరాటాలు నిర్మిస్తాం
గతంలో పీపుల్స్ వార్ , మావోయిస్ట్ పార్టీ రూపంలో ప్రజలకోసం పోరాటం చేశాం. మారిన పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజల మద్యలోనే ఉండాలనుకుంటున్నాం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వెలుగులో ప్రజా పోరాటాలు నిర్మించాలన్నదే మా ఆలోచన అని చంద్రన్న స్పష్టం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే 5 షెడ్యూల్, 1/70 చట్టం అమలు కావాలనుకున్నా పోరాటాలు ఒక్కటే మార్గమన్నారు. రాజ్యాంగం అందించిన చట్టాల ద్వారా కూడా ఆదివాసీల రక్షణ లేక పోతే ప్రతిఘటన వస్తుందన్నారు.. ఇప్పటికైనా అధికారులు ఆదివాసీల సంక్షేమం, రక్షణ కోసం రూపొందించిన చట్టాలను వెంటనే అమలు చేయాలని మావోయిస్ట్ పార్టీ మాజీ నేత చంద్రన్న డిమాండ్ చేశారు.
* జల్ – జంగల్ – జమీన్ కోసం ఉద్యమం
కొమురం పోరాట చరిత్ర అప్పటి పీపుల్స్ వార్ పార్టీ అద్వర్యంలో అల్యం రాజయ్య, సాహుల అద్వర్యంలో నవల రూపంలో తీసుకొచ్చారన్నారు. అనంతరం కొమురం భీం ఒక పోరాట స్పూర్తికి ఐకాన్ గా మారిపోయాడన్నారు. కొమురం భీం అడవిపై అటవీ సంపదపై ఆదివాసీ ప్రజలకు హక్కులు ఉండాలని పోరాటం చేశాడు. ఇప్పటికీ ఆ సమస్యలు పరిష్కారం కాలేదు. చేపలకు వెళ్ళినా కుటుంబ అవసరాల కోసం కలప తెచ్చుకున్నా ఫారెస్ట్ అధికారులు కేసులు పెడుతున్నారని చంద్రన్న అన్నారు. కొమురం భీం నాయకత్వంలో జల్ – జంగల్ – జమీన్ కోసం పోరాటం చేశారన్నారు..86 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆదివాసీ భూములకు కొత్తగా పట్టాలు ఇవ్వడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం తుడుం దెబ్బ నాయకత్వంలో పనిచేయాలని చంద్రన్న పిలుపునిచ్చారు. అలాంటి పోరాటాలే కొమురం భీం కు నిజమైన నివాళి అని చంద్రన్న అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ పుల్లూరి ప్రసాదరావు చంద్రన్న శంకరన్న బాల్నే అజయ్ కుమార్ ,గేడం గోపీచంద్
గంట సత్యం ,అర్కా శేషారావు రాష్ట్ర కార్యదర్శి, ముడిమడుగుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు.
————————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.

