* ఏపీలోనూ హై అలర్ట్
* అన్నమయ్య, కడప, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు
* పాఠశాలలకు సెలవులు ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : భారీ వర్షాలకు చెన్నై(Chennai) అతలాకుతలం అవుతోంది. తంజావూరు, తిరువనూరు, కాంచీపురం ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఊటీమార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. 5 రోజుల పాటు భారీ వర్షాలు అంటూ చెన్నై సహా ఐదు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. 17 వరకు కైలాసకోన, అరై, తలకోనలో పర్యాటకులకు నో ఎంట్రీ ప్రకటించారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ(Ap)లోని కృష్నా, బాపట్ల, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, అన్నమయ్య, కడప, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్(Red Allert) ప్రకటించారు. దీంతో పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
…………………………