Published:
Updated: 15 Oct 2024 • 06:42 AM
* భౌతికకాయానికి నివాళి అర్పించిన సీపీఐ నారాయణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పౌర హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబాది(Sai Baba) సహజ మరణం కాదని, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ (CPI Narayana) ఆరోపించారు. గన్‌పార్క్ వద్ద సాయిబాబా భౌతికకాయానికి ఆయన సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అన్యాయంగా అతడిని నాగ్‌పూర్ జైళ్లో బంధించారని ఆరోపించారు. సాయిబాబా చనిపోయిన ఆయన సిద్ధాంతాలు బతికే ఉంటాయన్నారు. ఆయన హత్యకు అసలు దోషి ఎవరో ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.
…………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
