ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం చింతగట్టు సమ్మక్క జాతర ఆదాయం రూ.4 లక్షల 15 వేల 7 వందలు వచ్చినట్టు జాతర కమిటీ చైర్మన్ తోట వెంకన్న, దేవాదాయశాఖ ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. సోమవారం జాతర ప్రాంగణంలో ఇప్పగూడెం, రంగరాయ గూడెం, కోమటి గూడెం, అక్కపల్లి గూడెం కుల సంఘాల సమక్షంలో హుండీలను లెక్కించారు. గత జాతరలో రూ. 3 లక్షల 96 వేలు రాగా ఇప్పుడు రూ.4 లక్షల 15 వేల 7 వందలు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కరుణాకర్ సర్పంచులు రాణి అనిల్, శిరీష్ రెడ్డి, సోమయ్య, లక్ష్మణ్ కుల పెద్దలు కత్తుల కట్టమల్లు, మందపురం ఎల్ల గౌడ్, సూపర్ండెంట్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

…………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
