ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ : పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జన్మదినం సందర్భంగా సుప్రభాత సేవలో పాల్గొని తిరుపతి (Tirupathi) వెంకన్నస్వామిని దర్శించుకున్నారు చిరంజీవి. తమ అభిమాన నటుడు పుట్టినరోజు సందర్భంగా ఫాన్స్ పండగ చేసుకుంటున్న వేళ.. మరింత కిక్ ఇచ్చేలా విశ్వంభర ఫస్ట్‌లుక్ (Vishwambhara First Look)ను విడుదల చేసింది యూవీ క్రియేషన్స్ సంస్థ. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’. ‘బింబిసార’ విజయం తర్వాత వశిష్ఠ మల్లిడి (Vasista mallidi)దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. విక్రమ్, వంశీధర్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మాతలు. త్రిష, ఆషిక రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ పోస్టర్ సెన్సేషనల్ గా కనిపిస్తోంది. పోస్టర్ లో చిరంజీవి త్రిశూలం పట్టుకొని ఓ భారీ కొండపై కొత్త లోకంలోకి వెళ్తున్నట్టు ఉంది. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
————————————-