ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
* బాధితులను పరామర్శించిన ఏపీ సీఎం
ఆకేరు న్యూస్, అమరావతి : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం(Achutapuram)లో ప్రమాద ఘటన స్థలాన్ని, బాధిత కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబు (AP Cm Chandrababu) పరామర్శించారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మెడికవర్ హాస్పిటల్, వెంకోజిపాలెంకు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించారు. వైద్య బృందాలతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చంద్రబాబు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాద ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు.
నష్టపరిహారం కోసం పట్టు
ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ లో జరిగిన ప్రమాదంలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి చెందిన 8 మంది, ఇంజనీరింగ్ కి చెందిన ఐదుగురు, ల్యాబ్ కు నలుగురు చెందిన మృతి చెందారు. ఫార్మాలో చేరిన నెలరోజుల్లోనే రాజశేఖర్, సతీష్, మోహన్ దుర్గాప్రసాద్ మృతి చెందారు. ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్ రాజశేఖర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సతీష్, హౌస్ కీపింగ్ బాయ్‌గా మోహన్ దుర్గాప్రసాద్ మృతి చెందారు. నిన్న అర్ధరాత్రి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు 18 మృతదేహాలను తరలించారు. నష్టపరిహారం ప్రకటించేంత వరకూ పోస్టుమార్టం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy Cm Pavan Kalyan) లేదా జిల్లా అధికారి కలెక్టర్ అధికారికంగా ప్రకటిస్తేనే పోస్టుమార్టానికి అంగీకరిస్తామని బంధువులు తెలిపారు.
———————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
