Shreshti Varma joins BJP
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలుగు సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ పేరు మరోసారి వార్తల్లో నిలుస్తోంది. డ్యాన్స్ రియాలిటీ షోల ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. రంగస్థలం, పుష్ప, గేమ్ ఛేంజర్, జైలర్ తదితర చిత్రాల్లో ఆమె పనిచేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.
* ఢీ షో తోమంచి గుర్తింపు
శ్రష్టి వర్మకు ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. వెండితెరపై కూడా నటిగా అడుగుపెట్టి యథా రాజా తథా ప్రజా చిత్రంలో కనిపించారు.
* జానీ మాస్టర్ పై తీవ్ర ఆరోపణలు
2024లో జానీ మాస్టర్‌పై శ్రష్టి వర్మ చేసిన ఆరోపణలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై ఆమె మీడియా ముందుకు వచ్చి తన వాదనను వెల్లడించారు. ఆ తర్వాత ఆమె పేరు సినీ వర్గాల్లోనే కాకుండా సామాజిక అంశాలపై జరిగే చర్చల్లోనూ వినిపించింది.
* బిగ్ బాస్ సీజన్ 9తో.. పాపులారిటీ
2025లో బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో పాల్గొనడంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది. షోలో తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్న శ్రష్టి.. తన వ్యక్తిత్వం, జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు.
* బీజేపీలోకి కొరియోగ్రాఫర్
ఇక తాజాగా శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. మరికొందరు ఆమె వెంట నడిచారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే జరిగింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
