* హైదరాబాద్‌లోకి అంతర్రాష్ట్ర ముఠాలు
* శివారులో ధార్ గ్యాంగ్ హల్చల్
* అత్యాధునిక సాంకేతికత ఉన్నా.. అడ్డుకట్టవేయలేని వైనం
* చుడీదార్ దొంగలు నగరంలోనే ఉన్నారా?
* భయపెడుతున్న వరుస దొంగతనాలు
చోర్.. చోర్.. అనే పదం మహానగరంలో నిత్యం ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటోంది. వరుస చోరీలతో నగరం వణుకుతోంది. నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరగడంతో దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. చుడీదార్, ముఖానికి ముసుగుతో మహిళల వేషధారణలో అపార్ట్మెంట్లోకి ప్రవేశించి చోరీలకు పాల్పడిన దొంగల జాడ ఇప్పటి వరకూ తెలియలేదు. తాజాగా మేడ్చల్ (Medchal) లో బురఖా(Burkha) ధరించి బంగారు దుకాణంలో దొంగతనయత్నం ఘటన సంచలనంగా మారింది. చెడ్డీలు, లుంగీలు, మంకీక్యాప్ల స్థానంలో ఇప్పుడు దొంగలు చుడీదార్(Chudidar)లు, బురఖాలు, ముసుగులతో వచ్చి దారుణాలకు పాల్పడుతున్నారు. నయా డ్రెస్‌కోడ్‌తో బెంబేలెత్తిస్తున్నారు.
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అత్యంత సాంకేతిక నగరం.. హైదరాబాద్(Hyderabad) మహానగరం. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా.. ఠక్కున చేరుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉందంటూ ఉన్నతాధికారులు పదేపదే చెబుతూ ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. నగరం మొత్తం సీసీ కెమెరా నిఘా ఉన్నా దొంగల(Thieves) కు అడ్డుకట్టపడడం లేదు. మహానగరంలో అత్యాధునిక టెక్నాలజీ(Technology) అందుబాటులో ఉన్నా.. పోలీసులకు పట్టుబడతామన్న భయం దొంగలకు ఉండడం లేదు. నగరంలో రెచ్చిపోతున్న దొంగల తీరే అందుకు నిదర్శనం.
ఇక్కడే సుమారు 10 లక్షల కెమెరాలు
దేశంలోనే అత్యధిక సీసీటీవీ(CCTV) కెమెరా(Camera)లున్నది హైదరాబాద్ మహానగరంలోనే. ట్రై కమిషనరేట్ పరిధిలో సుమారు పది లక్షల(Ten lakhs) కెమెరాలున్నాయి. చీమ చిటుక్కుమన్నా వెంటనే తెలుసుకునేలా, ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోని కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంట (Command Control Center) ర్కు అనుసంధానం చేశారు. అయినా నగరంలో వరుస చోరీలకు పాల్పడి హల్చల్ సృష్టించిన దోపిడీ దొంగలను పట్టుకోలేక పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు స్థానిక దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతుండగా.. మరోవైపు అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు నగరంలోకి ప్రవేశించి చోరీలకు తెగబడుతున్నాయి.
చుడీదార్ దొంగలు నక్కి ఉన్నారా?
చుడీదార్ ధరించి, ముఖానికి ముసుగు ధరించి మహిళల వేషధారణలో అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన చోరీలకు పాల్పడిన దొంగల జాడ ఇప్పటి వరకు తెలియలేదు. ఎస్ఆర్నగర్(SR Nagar) పోలీస్ స్టేషన్(Police Stion) పరిధిలో తాళం పగులగొట్టి ప్లాట్‌లోకి ప్రవేశించిన దొంగలు అల్మారాలో దాచిన నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన తీరును బట్టి ప్రొఫెషనల్ దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీ చేసినట్లు పోలీసులు అనుమానించారు. కొద్దిరోజుల క్రితం సిటీ కమిషనరేట్ పరిధిలో మూడు భారీ చోరీలకు పాల్పడ్డ ఈ దొంగల ముఠాల జాడ తెలియలేదు. ఆ దొంగల ముఠాలు నగరంలోనే నక్కి ఉన్నాయా..? నగరం దాటేశాయా? అనేది అంతుపట్టడం లేదు.
‘ధార్’.. శివారు ప్రజల బేజార్..
సిటీలో చుడీదార్, బురఖా దొంగలు హల్చల్ చేస్తుండగా, శివారులో మధ్యప్రదేశ్(Madhya Pradesh) కు చెందిన ‘ధార్‘ గ్యాంగ్(Dhar Gang) భయాందోళన సృష్టిస్తోంది. నగరంలోని అపార్ట్మెంట్ల(Apartments) ను చుడీదార్ గ్యాంగ్(Chudidar gang) లక్ష్యంగా చేసుకుంటే, శివారులో గేటెడ్ కమ్యూనిటీ(Gated community) లను ధార్ గ్యాంగ్(Dhar Gang) టార్గెట్ చేస్తోంది. అంతరాష్ట్ర దొంగలు హైదరాబాద్(Hyderabad)లోకి చొరబడి దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు. ఇండ్లలో చోరీలు, రాత్రిపూట ఒంటరిగా వెళ్లేవారి నుంచి సెల్ఫోన్లు, నగదు, ఆడవారి నుంచి మంగళసూత్రాలు దోచుకెళ్తున్నారు. రాత్రుళ్లు తలుపులు కొడితే.. ఎవరో తెలుసుకోకుండా తీయవద్దని పోలీసు(Police)లు ప్రకటన చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
బురఖాతో ఒకడు.. హెల్మెట్‌తో ఇంకొకడు..
తాజాగా మేడ్చల్(Medchal) పోలీస్‌స్టేషన్(Police Stion) సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న జగదాంబ జువెలరీ(Jagadamba Jewellery) దుకాణంలోకి బురఖా ధరించి ఒకడు, హెల్మెట్ ధరించి ఇంకొకడు చొరబడి దొంగతనానికి యత్నించారు. బురఖా ధరించిన వ్యక్తి నగల కోసం షాపు యజమాని శేషురాంను కత్తితో గాయపరిచాడు. అయినా శేషూరాం చాకచక్యంగా దుండగులను తప్పించుకొని చోర్.. చోర్.. అని అరుస్తూ రోడ్డుపైకి వచ్చారు. దీంతో దొంగలు పరారయ్యారు. ఇలా రకరకాల వేషధారణలతో నగరంలోకి చొరబడుతున్న దొంగలు వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. ఈనేపథ్యంలో దొంగల వేటలో పోలీసులు కూడా కొత్త పంథాను అనుసరించాలని ప్రజలు కోరుతున్నారు.
—————————–