CJP Parliament March Protest
Published:
* బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
ఆకేరు న్యూస్, డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘పార్లమెంట్ ముట్టడి’ పిలుపుతో పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు యత్నించిన సీజేపీ శ్రేణులను, నిరసనకారులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేసేవరకు తమ నిరసన ఆగేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
