* కర్రలతో దాడి చేసుకున్న వర్గాలు
* మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ కేపీహెచ్బీ(Kphb)లో చెలరేగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. 9వ ఫేజ్లో చెత్త తరలించే విషయంలో వివాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలుగా విడిపోయి.. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నెట్టెమల్లు అనే వ్యక్తి తీవ్రగాయాలతో మృతి (Dead) చెందాడు. గాయపడ్డ వ్యక్తులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేపీహెచ్ బీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
