* మద్యంతర బెయిల్ మంజూరి
* జూన్ 2న తిరిగి జైలు కు వెళ్ళాలి
* సుప్రీంకోర్టు షరతులు
ఆకేరు న్యూస్ ; న్యూ ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. శుక్రవారం సుప్రీం కోర్టు షరతులతో కూడిన మద్యంతర బెయిల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది .ఢిల్లీ లిక్కర్ పాలసీ , మనీ లాండరింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ గత కొంత కాలంగా తీహార్ జైలులో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచార నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి , రాజకీయ పార్టీ రాష్ట్ర కీలక నాయకుడిగా ఉన్న కేజ్రీవాల్ కు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీంకోర్టు ప్రకటించింది. మద్యంతర బెయిల్ ఇవ్వడం అంటే తిరిగి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించామన్న కోణంలో అర్థం చేసుకోవద్దని సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది. ముఖ్యమంత్రీ కార్యాలయానికి, సెక్రటేరియట్‌కు వెళ్ళకూడదన్న షరతు విధించింది. అధికారికి ఫైళ్ళ మీద సంతకాలు చేయకూడదు. అదే విదంగా సాక్షులతో మాట్లాడడం, కేసుకు సంబందించి ప్రచారం చేయడం లాంటి పనులు చేయకూడదన్నది. జూన్ 1 వతేది వరకు మాత్రమే ఈ బెయిల్ అమల్లో ఉంటుంది. తిరిగి జూన్ 2 వతేదీన తిరిగి జైలుకు వెళ్ళాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
* నియంతృత్వం పై నా పోరాటం
నేను తిరిగి వచ్చాను. ఇక నా పోరాటం అంతా దేశాన్నిపీడిస్తున్న నియంతృత్వం పైనే .. అని తీహార్ జైలు నుంచి విడుదలయిన తర్వాత అన్నారు. తీహార్ జైలు నుంచి విడుదలయిన తర్వాత ఆప్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆప్ శ్రేణులు కేజ్రీవాల్ విడుదల కావడంతో ఆనందోత్సవాల్లో మునిగి తేలారు. మిఠాయిలు పంపిణీ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
———————————–