* వసూళ్లకు పాల్పడితే తాట తీస్తా : రేవంత్ రెడ్డి
* నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి : శాంతి కుమారి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని , వారి భరతం పట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CHIEF MINISTER REVANTHREDDY) సంబంధిత అధికారులను ఆదేశించారు.. కూల్చకుండా, కూలుస్తామని భయపెడుతూ కొందరు భారీగా వసూళ్లు చేస్తున్నారని తనకు అనేక ఫిర్యాదులు(COMPLAINTS) అందాయని ఆయన పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన రేవంత్ గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారిపై చర్యలు తప్పవని, తాట తీస్తామని హెచ్చరించారు. ఎవరు ఇటువంటి వసూళ్లకు పాల్పడినా తాట తీసుడేనని హెచ్చరించారు. కాగా, ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైకోర్టు వ్యాఖ్యలతో సీఎస్ సమీక్ష
చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైడ్రా(HYDRA) అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. హైకోర్టు (HIGH COURT)జారీ చేసిన ఆదేశాలను పరిగణంలోకి తీసుకుంటూ, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై హైడ్రాకు మరిన్ని అధికారాలను, సిబ్బందిని అప్పగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ అడ్వకెట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి, ఎసిబి డైరెక్టర్ తరణ్ జోషి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా శాంతి కుమారి(SHANTHI KUMARI) మాట్లాడుతూ, చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపుపై ప్రస్తుతం నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయితీ రాజ్, వాల్టా తదితర విభాగాలు వేర్వేరుగా నోటీసులు జారీ చేస్తున్నారని, దీనివల్ల ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు. దీనిని నివారించటానికి, ఓ.ఆర్.ఆర్.పరిధిలో అన్ని విధాలా ఆక్రమణల తొలగింపు నోటీసులను హైడ్రా ద్వారానే చేపట్టేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. హైడ్రాకు కావాల్సిన అదనపు అధికారులు, సిబ్బందిని త్వరలోనే కేటాయించనున్నట్టు తెలిపారు. ఎఫ్.టీ.ఎల్, నాలా ఎన్క్రోచ్మెంట్, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కుల పరిరక్షణ లను హైడ్రా పరిధిలోకి తేనున్నామని చెప్పారు. గండిపేట, హిమాయత్ సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జల మండలి నుండి హైడ్రా పరిధిలోకి తేనున్నామని వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
