
* ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు
* రేవంత్ పాలన చూస్తే ప్రజలకు ఇది ప్రజాపాలన కాదు ప్రజాపీడన పాలన అనిపిస్తుంది
* మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వికృతరూపం బట్టబయలైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (HARESH RAO) పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు (HARESH RAO) మాట్లాడారు. రాష్ట్రంలో 11 నెలల రేవంత్ రెడ్డి (REVANTH REDDY) పాలన చూస్తే ప్రజా పాలన కాదు ప్రజా పీడనగా కనబడుతుందన్నారు. ప్రజా పాలన తొలిగిపోయి కాంగ్రెస్ పార్టీ వికృతరూపం బట్టబయటలైందని.. ఏ వర్గానికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని హెద్దేవ చేశారు. సీఎం వికృతరూపాన్ని చూసి ప్రజలు విస్తుపోతున్నారని.. రాష్ట్రంలో ఎక్కడా చూసినా ధర్నాలతో అట్టుడికిపోతోందని పేర్కొన్నారు.
నోటికొచ్చినట్టు మాట్లాడడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయమంటే సీఎం నోటికొచ్చినట్టు తిడుతున్నాడని.. ఇది సీఎం వైఖరి అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. కొత్త హామీల మాట అటుంచండి.. కేసీఆర్ మానవీయ కోణంలో పేదలు, ప్రజల కోసం తెచ్చిన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగించలేకపోతున్నారరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరలు ఒకటి కాదు రెండు ఇస్తామన్నారని.. కానీ అది కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ.. రైతుల కోసం రైతుబంధు అమలు చేసిండు కేసీఆర్.
రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతుబంధు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నారని.. ఒక్క పంటకు కూడా రైతు బంధు లేదని.. పదిహేను వేలు కాదు కదా..? ఉన్న పదివేలు కూడా రావడం లేదన్నారు. చివరకు పంటలు కొనే దిక్కు లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు జరగడం లేదని.. రూ. 7521కు క్వింటాల్ పత్తి కొంటామని మద్దతు ధర ప్రకటించినా రైతులు రూ. 5500కు పత్తి అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొందన్నారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మంలో రైతులు రోడ్డెక్కితే నీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందన్నారు. రైతులను రోడ్డు మీదకు తీసుకొచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పాలనలో దాపురించిందని హరీశ్‌రావు తెలిపారు.
………………………………….