* విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం
* బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) సీరియస్ అయ్యారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. గురుకులాలు, పాఠశాలలను తరచూ తనిఖీ చేయాలని, విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేస్తే చర్యలు తప్పవన్నారు.
విద్యార్థులకు పరిశుభ్రవాతావరణంలో పౌష్టికాహారం అంచించాలని జిల్లా కలెక్టర్ల(COLLECTORS)ను ఆదేశించారు. తరచూ పాఠశాలల, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల(GURUKULA SCHOOLS)ను తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలన్నారు. విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనుకాడమని సీఎం స్పష్టం చేశారు. కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి శక్తుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీఎం తెలిపారు.
………………………………………………