* డీజీపీకి అందిన నివేదిక
* నివేదికలో కీలక అంశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నాగరంలోని 42 ఎకరాల భూదాన్ భూమి (Bhudan Land)అన్యాక్రాంతం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఈరోజు తెలంగాణ డీజీపీ(Telangana Dgp)కి నివేదిక అందించింది. నివేదికలో ఆసక్తికర విషయాలను పొందుపరిచింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్(Amoy kumar), తహశీల్దార్ జ్యోతిలను విచారించిన అధికారులు తాజాగా వారి అరెస్టుకు సిఫారసు చేశారు. కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీవో , తహశీల్దార్ కలిసి ఆగమేఘాల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ(ED) గుర్తించింది. దీని వలన అధికారులు కోట్లు రూపాయలు పొందినట్లు ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఈడీ సిఫారసు చేసింది. కలెక్టర్ తో పాటు తహసీల్దార్ జ్యోతి,ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదు చేయాలని ఈడీ సూచించింది.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
